సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు శుభవార్త.. 10% డైట్ చార్జీల పెంపుపై ఎమ్మెల్యే గురజాల హర్షం
పేద విద్యార్థుల పోషకాహారానికి పెద్దపీట.. సీఎం నిర్ణయానికి గురజాల కృతజ్ఞతలు... ఎనిమిది వేల మంది విద్యార్థులకు లాభం.. డైట్ చార్జీల పెంపు అభినందనీయం... హాస్టళ్లలో నాణ్యమైన భోజనానికి ఊతం.. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే స్పందన... విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. డైట్ చార్జీల పెంపుతో మెరుగైన సౌకర్యాలు... చిత్తూరు( జులై 09),(జ్ఞాన ప్రకాష్ చిత్తూరు జర్నలిస్ట్):రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నివసిస్తూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరంలో 10 శాతం డైట్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం...