పీసీపీఎన్‌డీటీ, ఏఆర్టీ చట్టాల అమలుపై జిల్లా స్థాయి సమీక్ష.. కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం

జిల్లా కలెక్టరేట్‌లో డీఎల్‌ఎంఎంఏ, డీఎల్‌ఏసీ సమావేశం నిర్వహణ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవల్ మానిటరింగ్ అండ్ మానిటరింగ్ అథారిటీ (DLMMA) మరియు డిస్ట్రిక్ట్ లెవల్ అడ్వైజరీ కమిటీ (DLAC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టం మరియు ఏఆర్టీ (ART) చట్టం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మీ నరసయ్య, అదనపు ఎస్పీ శ్రీ వెంకటాద్రి, జిల్లా ల్యాబ్ అధికారి డా....