పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ఘనంగా నివాళులు
పవన్ కళ్యాణ్ చూపిన మానవత్వం యావత్ సమాజానికి ఆదర్శం – జనసేన నాయకుడు మిథున్ షాలి రేణిగుంట, జూలై 9 (రాజనీతి): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన నిరంజన్ మృతి పట్ల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బుధవారం సాయంత్రం పట్టణంలో శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. నిరంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, పవన్ కళ్యాణ్‌పై ఆయనకున్న అచంచలమైన అభిమానాన్ని స్మరించుకున్నారు. చాలా కాలంగా అరుదైన...