హలో.. నేను మీ కలెక్టర్‌ను మాట్లాడుతున్నా!”: బీఎల్‌ఓ ఇంటికొచ్చారా?": ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి వారి పని తీరుపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్!

అన్నమయ్య జిల్లా, జులై 8: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం సోమల మండలంలోని 146వ మరియు 148వ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, హౌస్‌హోల్డ్ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల సవరణ, నివాస మార్పులు, మరణించిన ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను...