జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యం.. 77 ఏళ్లుగా విద్యార్థి ఉద్యమంలో ఎబివిపి ప్రయాణం...
చిత్తురు (జులై 08),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించాలనే లక్ష్యంతో ఏర్పడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని ఆ సంస్థ తిరుపతి–కడప విభాగ్ సంఘటన మంత్రి సాయి సత్యనారాయణ తెలిపారు. జూలై 9, 1949న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి, నేడు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, జిల్లాల స్థాయిలో విస్తరించి లక్షలాది మంది విద్యార్థులను జాతీయ భావాలతో కూడిన నాయకత్వం వైపు తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు.సంస్థ ఆవిర్భావం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమేనని వివరించారు."జ్ఞానం–శీలం–ఏకత" అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి విద్యార్థి...