నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు
రేణిగుంట, జూలై 8 (రాజనీతి): గతంలో చైన్ స్నాచింగ్ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలైన ఇద్దరు యువకులు, తమ అరెస్టుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరించిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు ఇటీవల జైలు నుంచి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో తమ అరెస్టుకు...