జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి సమీక్షా; సైబర్ నేరాల బాధితులకు హోల్డ్ మనీ వాపస్ చేయుటకు ప్రత్యేక ప్రాధాన్యత.
అనకాపల్లి, జూలై 07: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాబోవు తేదీ.11.07.2026 న జరగనున్న "జాతీయ లోక్ అదాలత్" లో ఇరు పార్టీలు వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఉన్నతాధికారులతో మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు మరియు ఆర్థిక సైబర్ నేరాల కేసుల పురోగతిని ఆయన పరిశీలించారు. కేసుల పరిష్కారంలో 10% పెంపుదలే లక్ష్యం: సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, గత లోక్ అదాలత్ ఫలితాల కంటే ఈసారి...