ఆశా కార్యకర్తల ధర్నాను జయప్రదం చేయండి – సీఐటీయూ అన్నమయ్య జిల్లా నాయకులు మండెం సుధీర్ కుమార్

కలకడ, జూలై 7: జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ఆశా కార్యకర్తల ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ అన్నమయ్య జిల్లా నాయకులు మండెం సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆశా డే సందర్భంగా అన్నమయ్య జిల్లా కలకడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను కలిసి సీఐటీయూ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన కరపత్రంలోని డిమాండ్లను వివరించారు. ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మండెం సుధీర్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో ఆశా కార్యకర్తలు ప్రభుత్వ ఆరోగ్య...