జీవో 396 వెంటనే రద్దు చేయాలి దస్తావేజు రచయితల ఆందోళన ఉధృతం.. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన

మదనపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు రచయితలు, వారి సహాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. గత ఆరు రోజులుగా సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు, మంగళవారం కార్యాలయం ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ జీవో అమలుతో రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు రచయితల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాలను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న వేలాది మంది దస్తావేజు రచయితలు, వారి సహాయకుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. ఈ వృత్తిపై ఆధారపడిన...