నెట్టిబండ కాలనీలో 50% SIR పూర్తి.. నల్లారి ఆదేశాలతో లక్ష్మీకర ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పీలేరు మండలం యర్రగుంట్ల పల్లి గ్రామం నెట్టిబండ కాలనీలో SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీకర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకర మాట్లాడుతూ నెట్టిబండ కాలనీలో SIR ప్రక్రియ 50% పూర్తయింది. మిగిలిన వాటిని గడువులోపు 100% పూర్తి చేస్తామని తెలిపారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించి, అర్హులైన కొత్తవారికి ఓట్ల నమోదు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దినచంద్రారెడ్డి, ప్రభాకర్ రాజు రెడ్డి,...