జీవితాంతం ఎడారిలో గడిపి.. చివరకు అక్కడే.. తెలంగాణ వాసి దీనగాథ
పేదరికం నుంచి బయటపడటానికి పెళ్లయిన సంవత్సరానికే ఎడారి బాట పట్టిన ఒక తెలంగాణ వ్యక్తి ఒక్కసారి కూడా వెనక్కి రాకుండా అరబ్బు దేశంలో ఏకధాటిగా 44 ఏళ్ళు గడిపాడు. చివరకు అక్కడే కన్నుమూశాడు. 44 ఏళ్ళలో ఒక్కసారి కూడా మాతృభూమికి రాలేని వైనం మరణం తరువాత తానో భారతీయుడినని నిరూపించుకొన్న పేద ప్రవాసీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య.. దళితులకు వంశపార్యంగా సంక్రమిస్తున్న పేదరికం నుంచి బయటపడడానికి 44 ఏళ్ళ క్రితం ఎడారి బాట పట్టాడు. 1982లో సౌదీ అరేబియాకు వెళ్లి, ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి రాలేదు. అప్పటికే అదే గ్రామానికి చెందిన లక్ష్మితో పెళ్లైన...