గోదావరి గుండెలోకి జగన్ తిరిగి అడుగుపెడుతున్నారు. భీమవరం ఆక్వా రైతుల సమస్యలతో ప్రత్యక్ష పోరాటం!
వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా కలిగిన ప్రాంతం అది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మొత్తానికి మొత్తం సీట్లు పట్టం కట్టి వైసీపీకి జీరో మార్కులు వేసిన కీలక రాజకీయ స్థావరమది.రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు అయిన గోదావరి జిల్లాలలో తమ పర్యటనకు జగన్ శ్రీకారం చుడుతున్నారు. జగన్ ఇప్పటిదాకా రెండేళ్ళ కాలంలో అడపా దడపా పరామర్శలు చేశారు. ఎక్కువగా క్రిష్ణా గుంటూరులలోనే ఆయన పర్యటనలు సాగాయి. మధ్యలో విశాఖ దాకా వచ్చారు. అయితే జగన్ తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి వస్తున్నారు. వారితో కలసి ఆందోళన :...