పాకాల మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే పులివర్తి నాని
పాకాల, జూలై 6 (ప్రతినిధి): పాకాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ అధ్యక్షుడు లోకనాథం ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ప్రతి శాఖ అధికారి విధిగా హాజరుకావాలని సూచించారు. సమావేశంలో లేవనెత్తిన ప్రతి సమస్యను నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు....