దారి తప్పిన ఏనుగుల బీభత్స తోటలు, టెంకాయ చెట్లు వరి పంట నేరేడు చెట్లు పంటలకు భారీ నష్టం. ఐదు లక్షలు ఆస్తి నష్టంన ఆవేదన చెందిన రైతు వెంకటరమణ
కె.వి పల్లి, జులై 06 అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి మండలంలోని నూతన కాలువ పంచాయతీ పరిధిలో దారి తప్పిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గురకంపల్లి, ఉప్పుతోల నాగయ్య కుమారుడు ఉప్పుతోళ్ల వెంకటరమణ పొలములో ప్రాంతాల్లో సంచరించిన ఏనుగులు రైతుల టెంకాయ చెట్లు 30 వరి పంట పొలాల్లోకి చొరబడి తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికుల కథనం ప్రకారం, ఏనుగులు బొప్పాయి చెట్లు విరగొట్టడంతో పాటు టెంకాయ చెట్లను నేలకూల్చాయి. పొలాలకు ఏర్పాటు చేసిన బోరు ధ్వంసం చేసి, నీటి సరఫరా కోసం వేసిన పైపులను తొక్కేయడంతో అవి విరిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో...