ప్రజల సమస్యలకు తక్షణం న్యాయం: అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ స్పష్ట సూచన

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ గారు, తక్షణమే చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, తీసుకున్న చర్యల నివేదికను వెంటనే కార్యాలయానికి సమర్పించాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసు స్టేషన్ల లో ఇచ్చే అర్జీలను కూడా 'పీజీఆర్ఎస్' కిందనే పరిగణించి, ప్రజలకు సత్వర న్యాయం అందిస్తామని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు....