రాయచోటిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: AICC సెక్రటరీ గణేష్ యాదవ్

రాయచోటి, ఏప్రిల్ 6: రాయచోటిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి AICC సెక్రటరీ గణేష్ యాదవ్, PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి కృషి వల్లే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మస్తాన్ వల్లి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలపై జిల్లా నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి...