విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా ఆదర్శ పాఠశాల, కె.వి.పల్లిని సందర్శించిన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధ

ఆదర్శ పాఠశాల కె.వి.పల్లిని సందర్శించిన అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధ గారు,పిఎంశ్రీ జిల్లా AAMO శ్రీ నాదిర్ష గారు అన్నమయ్య జిల్లా ఆదర్శ పాఠశాల, కె.వి.పల్లిని ఈరోజు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (APC) శ్రీమతి అనురాధ గారు సందర్శించారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ (PM SHRI) పథకం కింద విడుదలైన నిధులు, వాటి వినియోగం మరియు చేపట్టిన అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, బోధన-అభ్యాస విధానాలపై ఆరా తీశారు. సందర్శనలో భాగంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌లు, వొకేషనల్ ఎక్విప్‌మెంట్, పాల్ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాల...