మామిడి రైతులకు కేంద్ర సాయం.. బీజేపీ నేతల పాలాభిషేకం
తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతగా చిత్తూరులో శనివారం బీజేపీ నాయకులు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతులు కొనుగోలుదారుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి విజ్ఞప్తి...