రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు ఘన సన్మానం
రేణిగుంట మండల తహసీల్దార్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పారదర్శకమైన పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రజలకు నేరుగా సేవలందించే అత్యంత కీలకమైన విభాగమని అన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి ప్రతిరోజూ భూ సమస్యలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, పాస్బుక్లు, భూ రికార్డులు, వారసత్వ నమోదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అనేక సమస్యలతో ప్రజలు వస్తుంటారని గుర్తు చేశారు....