వేగంగా "సర్" క్షేత్రస్థాయి పరిశీలన కమిషనర్ పి.నరసింహ ప్రసాద్

ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) లో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించాలని ఏఈఆర్వో, కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. శనివారం నగరపాలక పరిధిలోని 83,84,85, 87, 95, 125 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఎన్యుమరేషన్ పత్రాల పరిశీలనను తనిఖీ చేశారు. ఎన్యుమరేషన్ పత్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి పరిశీలన, ఆన్లైన్ నమోదు తీరును పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయడంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని, తప్పులు లేకుండా పూర్తి చేసేలా చూడాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధింత బీఎల్వోలు పాల్గొన్నారు.