అన్నమయ్య జిల్లాలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్..

అమరావతి // 4.7.2026 అన్నమయ్య జిల్లా మొలకలచెర్వు మండలానికి చెందిన 6 సంవత్సరాల చంద్రిక లో కనిపిస్తున్న లక్షణాలు, కుటుంబ వైద్య చరిత్రను వైద్యుల బృందం నిశితంగా పరీక్షించింది. తద్వారా వైద్యులు ప్రాథమికంగా Xeroderma Pigmentosum (XP) వ్యాధి అభిప్రాయపడ్డారు. అయితే, దీనిని నిర్ధారించేందుకు అవసరమైన ప్రత్యేక పరీక్షలు చేయడంతో పాటు నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని వైద్య బృందం తెలిపినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే మంత్రి శ్రీ సత్యకుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీ నరసయ్య, వైద్యుల (పీడియాట్రిక్, ఆప్తమాలజిస్టు)ను హుటాహుటిన ఇంటికి పంపించారు....