ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొందాం... తక్కువ నీటి పంటలతో రైతుల ఆదాయాన్ని పెంచుకుందాం!
*తక్కువ నీటి పంటలు వేసి ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన* పీలేరు ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడే నీటి ఎద్దడిని తట్టుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. పీలేరు మండలం బోడుమల్లు వారి పల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని మొరవడి పల్లి గ్రామంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, హార్టికల్చర్, అగ్రికల్చరల్, ఏపీ సీఎన్ఎఫ్, డి.ఆర్.డి.ఏ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు *కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ* ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు,...