మన్యం వీరుడి చిత్రపటానికి అదనపు ఎస్పీ శ్రీ యం.వెంకటాద్రి గారి ఘన నివాళి.

తేదీ:04.07.2026 అన్నమయ్య జిల్లా - మదనపల్లి మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం.వెంకటాద్రి గారు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అమాయక గిరిజనులను...