కుటుంబ కలహాలతో మనస్తాపం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి పంచాయతీ తారకరామనగర్‌కు చెందిన టి. మణి అలియాస్ సుబ్రహ్మణ్యం (36) పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కుటుంబ, పిల్లల విషయమై తన సహజీవన భాగస్వామి తుపాకుల లలితతో ఈ నెల 28న జరిగిన వాగ్వాదం అనంతరం మనస్తాపానికి గురైన మణి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జూలై 2 రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదులో, పిల్లలు దూరంగా ఉండటం వల్ల...