రాయలసీమ కల సాకారం.. కడపలో ఉక్కు పరిశ్రమకు శ్రీకారం
రాయలసీమ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ కల సాకారమయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కడప జిల్లా జమ్మలమడుగులో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టడం రాయలసీమ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలకు పలుమార్లు హామీలు ఇచ్చి శంకుస్థాపనలు చేసినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. మూడు సార్లు శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించకపోవడం ద్వారా ప్రజల ఆశలను వమ్ము చేశారని...