బండ్లవంక, ట్రెజరీ వీధుల్లో పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న మార్కెట్ యార్డు చైర్మన్ పురం రామమూర్తి
పీలేరు పట్టణంలోని బండ్లవంక, ట్రెజరీ వీధి, రాములవారి గుడి, సిల్వర్ లాడ్జి, సాయిబాబా స్కూల్ తదితర వీధుల్లో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పీలేరు మార్కెట్ యార్డు చైర్మన్ పురం రామమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పురం రామమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పెన్షన్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు...