పాపాఘ్ని నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

పీటీఎం, జూలై 1: అన్నమయ్య జిల్లాలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీటీఎం మండలంలోని బూర్లపల్లి–టీ. సదుం–చెన్నారాయునిపల్లె రహదారిపై కిలోమీటర్ 16/8–10 వద్ద పాపాఘ్ని నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూర్లపల్లి–టీ. సదుం–చెన్నారాయునిపల్లె రహదారిని కిలోమీటర్ 0/000 నుంచి 18/300 వరకు అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు ఆర్ అండ్ బి అధికారులు వివరించారు. ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల...