అంగన్‌వాడీలకు 70 ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ.
కె.వి.పల్లి, జూలై 1: కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, చిన్నారులు మరియు గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 70 ఇండక్షన్ స్టవ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్ స్వర్ణ చేతుల మీదుగా అంగన్‌వాడీ టీచర్లకు స్టవ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ స్వర్ణ మరియు మండల అధ్యక్షురాలు గీతాంజలి సంయుక్తంగా మాట్లాడిన వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం తయారీలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా వంట ప్రక్రియ మరింత వేగంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో గ్యాస్, కట్టెలపై ఆధారపడాల్సిన అవసరం...