కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక: మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అసలైన నాయకులని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, న్యాయం కల్పిస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారాలు శాశ్వతం కాకపోయినా పార్టీ కోసం కష్టసుఖాల్లో నిలబడిన కార్యకర్తల సేవలను ఎన్నటికీ మరవబోమన్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు, కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ జెండాను ఎత్తిపట్టిన కార్యకర్తల త్యాగాలే తెలుగుదేశం పార్టీకి బలమని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమం, గౌరవం పార్టీకి అత్యంత ప్రాధాన్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధారిత పార్టీ కాదని, కార్యకర్తల ఆధారిత...