లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కార్యకర్తలకే ప్రవేశం: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తపాలెం సమీపంలోని సభా ప్రాంగణాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సుమారు 500 బైక్‌లతో భారీ ర్యాలీగా సభా వేదికకు తీసుకువస్తామని చెప్పారు. అనంతరం ఉత్తమంగా పనిచేసిన సుమారు 210 మంది కార్యకర్తలను సన్మానించి, వారితో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు, కేసులు,...