డ్రంక్ అండ్ డ్రైవ్‌కు గట్టి హెచ్చరిక.. రూ.10 వేల జరిమానాతో పాటు రెండ్రోజుల సమాజ సేవ

మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి తిరుపతి కోర్టు వినూత్న శిక్ష విధిస్తూ కఠిన హెచ్చరిక జారీ చేసింది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జి. చంద్రశేఖర్‌పై మోటారు వాహనాల చట్టం సెక్షన్–185 కింద నమోదైన కేసును విచారించిన తిరుపతి ద్వితీయ ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో రూ.10 వేల జరిమానా విధించింది. అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్–23 ప్రకారం రెండు రోజుల పాటు రేణిగుంట పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాలను శుభ్రం చేస్తూ సమాజ సేవ చేయాలని ఆదేశించింది. ఈ సేవను అర్బన్ సీఐ జయచంద్ర పర్యవేక్షణలో నిర్వహించాలని, జూలై 2లోగా ఫొటోలతో కూడిన నివేదికను కోర్టుకు...