ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు – సీఐ జయచంద్ర
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను ముందుగానే అరికట్టడం లక్ష్యంగా రేణిగుంట పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పి సుబ్బారాయుడు ఆదేశాల మేరకు,డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో సోమవారం సీఐ జయచంద్ర, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టణంలోని సాయిబాబా వీధి, పోస్టాఫీస్ వీధి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణం, రద్దీ...