జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు: ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం - ఇన్చార్జ్ బెజవాడ దినేష్

రాజంపేట పార్లమెంటు నుంచి గ్రామస్థాయి వరకు నూతన కమిటీలు: పవన్ ఆదేశాలతో కసరత్తు తేదీ: 29-06-2026, సోమవారం పీలేరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రాజంపేట పార్లమెంటు స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని...