నేర రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి: ఎస్సై హరీష
నేర రహిత సమాజ నిర్మాణమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని గాజులమండ్యం ఎస్సై హరీష తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు, డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలు, సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మర్రిగుంట గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఎస్సై హరీష గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నియంత్రణ, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తత, డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి వ్యసనాల దుష్పరిణామాలపై వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, జూదం, పేకాట...