పేద విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ
విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో ఆదర్శప్రాయులుగా నిలవాలంటే చదువే ప్రధాన ఆయుధమని రేణిగుంట మండల విద్యాశాఖ అధికారి రంగనాథ్ అన్నారు. విద్యతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ, మానవీయ విలువలను అలవర్చుకున్నప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని ఆర్సీఎం యూపీ పాఠశాలలో శనివారం షమ్దా సానీ ఫౌండేషన్ (హాంకాంగ్) సహకారంతో చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రంగనాథ్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పాఠ్య సామగ్రిని పంపిణీ చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన...