అశ్రునయనాల మధ్య ఘనంగా షహాదత్ కార్యక్రమం
రేణిగుంట పట్టణంలోని మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో మొహర్రం మాసం పదో రోజు నిర్వహించే పవిత్ర షహాదత్ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, అశ్రునయనాల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శాంతి, ధర్మ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన కర్బలా అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని నివాళులర్పించారు. గౌసియా ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఖ్వాజా జూబేర్ హయాత్ అలీ షా ఖాదరీ ఆధ్వర్యంలో ఆశ్రమ ఆధ్యాత్మిక శిష్య బృందం సంప్రదాయబద్ధంగా పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి నీటి ప్రస్థాన కార్యక్రమాన్ని నిర్వహించింది. భక్తుల ప్రార్థనలు, దువాలు, ఫాతెహా పఠనాలతో...