పల్స్ పోలియో విజయవంతానికి మైక్ ప్రచారం.. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రేణిగుంట మండలంలో విస్తృత ప్రచారం చేపట్టినట్లు హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలిపారు. మండలంలోని ఐదేళ్లలోపు 8,388 మంది చిన్నారులకు 36 పోలియో బూత్‌లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయంలో 3 ట్రాన్సిట్ బూత్‌లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి రోజు చుక్కలు వేయించుకోని పిల్లలకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారిణి డాక్టర్ తేజస్విని కోరారు.