టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి.. 5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, స్మగ్లర్ అరెస్ట్

రేణిగుంట–చెన్నై మార్గంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపుదాడి నిర్వహించి ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రామావిలాస్ సర్కిల్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పద కారును ఆపగా ఇద్దరు వ్యక్తులు పరారయ్యే ప్రయత్నం చేశారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక స్మగ్లర్‌ను వెంటాడి పట్టుకుని అరెస్టు చేశారు. కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.