అక్రమ ఇసుక రవాణాపై పోలీసు దాడులు జేసీబీతో పాటు 14 ట్రాక్టర్లు స్వాధీనం

అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. రేణిగుంట మండలం, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాజులమండ్యం ఎస్‌ఐ హరీష, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారుల బృందాలు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. అక్రమ ఇసుక తవ్వకం, నిల్వ, రవాణాపై ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కొట్రమంగళం గ్రామ పరిధిలోని మునెమ్మకు చెందిన ప్రైవేటు స్థలంలో అక్రమంగా...