బాధితులకు అండగా CMRF చెక్కులు: పీలేరులో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి
కలికిరి నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కుల పంపిణీ - సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తేదీ: 26-06-2026, శుక్రవారం కలికిరి: వివిధ ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పీలేరు నియోజకవర్గ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే...