మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి... సిఐ మంజునాథ్ రెడ్డి

యువత దేశ భవిష్యత్తు అని, విద్యార్థి దశలో సరైన అవగాహనతో ముందుకు సాగితే సమాజం అభివృద్ధి చెందుతుందని రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి సూచించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీబీఆర్ కళాశాలలో ఈగిల్ ఇన్‌స్పెక్టర్,ఎస్‌ఐ హరీష,పోలీసు బృందం మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాల అవగాహన, శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. సోషల్ మీడియా, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని...