మహిళల ఆరోగ్యానికి శుభవార్త.. క్యాన్సర్ మరణాలను అడ్డుకుంటున్న వ్యాక్సిన్

గర్భాశయ ముఖ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణలో వైద్యరంగం మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, చిన్న వయసులో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 30 ఏళ్ల లోపు గర్భాశయ ముఖ క్యాన్సర్ వల్ల మరణించే ప్రమాదం దాదాపు శూన్యానికి చేరుకున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో HPV టీకా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ వల్ల వందలాది ప్రాణాలు రక్షించబడినట్లు నిపుణులు పేర్కొన్నారు. HPV వైరస్ గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్...