మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సిడబ్ల్యూఎం బి. ఆనంద్
తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ (సీఆర్ఎస్) చీఫ్ వర్క్షాప్ మేనేజర్ బి.ఆనంద్ మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే సేవలో ఉండగానే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, తోటి ఉద్యోగుల సహకారంతో నిధులు సమీకరించి వారి కుటుంబాలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్యోగుల్లో సేవాభావాన్ని, పరస్పర సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసింది. బుధవారం సీఆర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ముగ్గురు రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందజేశారు. తోటి ఉద్యోగులు...