మిట్స్ యూనివర్సిటీలో స్పేషియల్ కంప్యూటింగ్, వేర్‌బుల్ టెక్నాలజీలపై అతిథి ఉపన్యాసం....
మదనపల్లె సమీపంలోని (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో “స్పేషియల్ కంప్యూటింగ్ మరియు వేర్‌బుల్ టెక్నాలజీల భవిష్యత్” అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని బోస్టన్ నగరంలో గల నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్పేషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ (SINRG) డైరెక్టర్, ఏంజెల్ ఇన్వెస్టర్ డాక్టర్ మల్లేశం దాసరి హాజరై అధ్యాపకులు, విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం సంప్రదాయ స్క్రీన్ ఆధారిత కంప్యూటింగ్ నుంచి స్పేషియల్ కంప్యూటింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని...