జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి బంజారా కాలనీ కమిటీ వినతి

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్రోత్ హుస్సేన్ నాయక్‌ను రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ బంజారా హిల్స్ కాలనీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాల కల్పనతో పాటు జీవో నెం.30 ప్రకారం రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద శాశ్వత గృహాలకు చట్టబద్ధత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషన్ సభ్యుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాలాజీ నాయక్, రామచంద్ర నాయక్, నారాయణస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.