ఘనంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయ జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం
రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో వెలసిన సీతా లక్ష్మణ హనుమ పరివార సమేత శ్రీశ్రీశ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయ జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారం ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. భవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాస శుద్ధ పర్వదినాలను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహోత్సవాల్లో తొలి రోజు మంగళవారం ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భగవత్ ప్రార్థన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్ర పూజ, పంచగవ్య ఆరాధన, రక్షాసూత్రధారణ, ఆచార్య, ఋత్విగ్వరణం, యజమాన దీక్ష వంటి శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మృత్సంగ్రహణం, అంకురార్పణ,...