ఒత్తిడితో పరుగులు తీస్తున్న జీవితానికి యోగానే పరిష్కారం.... సిడబ్ల్యూఎం ఆనంద్
ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే యోగానే అత్యుత్తమ మార్గమని క్యారేజ్ రిపేర్ షాప్ (సీఆర్ఎస్) సిడబ్ల్యూఎం బి.ఆనంద్ పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి యోగా గొప్ప సాధనమని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రేణిగుంటలోని రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో సీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేసి ఆరోగ్య జీవన విధానంపై అవగాహన...