మానవతతో స్పందించిన కలెక్టర్.. నలుగురు వికలాంగులకు రూ.2 లక్షల తక్షణ సాయం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వినతిని ఆలకించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మానవతా దృక్పథంతో స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన నలుగురు వికలాంగులకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కరకంబాడి సమీప బీసీ కాలనీకి చెందిన గంప కుటుంబ సభ్యుల దయనీయ పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే చెక్కు అందజేశారు. అలాగే బాధితులకు పెన్షన్, సదరం ధ్రువపత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్పందనపై కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.