ఎస్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీలేరులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

పీలేరు, జూన్ 21: ఎస్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీలేరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. వినీల, తెలుగు అధ్యాపకులు మరియు యోగా గురువు డా. శ్రీనివాసులు రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. టి. వినీల మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం ప్రతి వారం ప్రత్యేక యోగా తరగతులు నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు....