భూలోక తండ్రి ఆలింగనంలో ఆవిష్కృతమైన పరలోక తండ్రి ప్రేమ
తప్పిపోయిన కుమారుడిని చేర్చుకున్న తండ్రి... పరలోక ప్రేమకు ప్రతిరూపం బైబిలులో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలలో “తప్పిపోయిన కుమారుని ఉపమానం” అత్యంత హృదయస్పర్శిగా నిలుస్తుంది. ఈ ఉపమానం ద్వారా దేవుని అపారమైన ప్రేమ, క్షమాగుణం, కరుణ, సహనాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారిలో చిన్న కుమారుడు తనకు రావలసిన ఆస్తి వాటాను ముందుగానే తీసుకుని, దూర దేశానికి వెళ్లి వ్యర్థమైన జీవన విధానంలో తన ఆస్తి మొత్తాన్ని వృథా చేశాడు. కొంతకాలానికి ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడంతో అతడు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. చివరకు పందులను మేపే దుస్థితికి చేరుకొని, తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అప్పుడు...